మనతెలంగాణ/హైదారాబాద్: దక్షిణ భారతదేశంలో ఆదివారం నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని జార్ఖండ ,బీహార్ , యూపి, పశ్చిమ బెంగాల్ , నాగాలాండ్ ,మణిపూర్ ,మిజోరం ,త్రిపుర ,మేఘాలయ ,అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్ , చత్తిస్‌గఢ్ ,ఒడిశా, మధ్యప్రదేశ్ ,కోస్తాంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు,కేరళ అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.పంజాబ్ ,హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది.
తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 12 న పశ్చిమ బెంగాల్ , సిక్కింలో వర్షాలు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో చలి ప్రభావం పెరుగుతోందని వాతవరణ శాఖ వెల్లడించింది. మరో వైపు కిందిస్థాయిలో గాలులు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజులపాటు పొడివాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.