Thursday, January 23, 2025

సూపర్8 మ్యాచ్‌లకు వరుణ గండం

- Advertisement -
- Advertisement -

అంటిగువా : పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ 8 మ్యాచ్‌లు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లను వెస్టిండీస్‌లోని బార్బోడస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగువా వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే, అక్కడి వాతావరణ శాఖ రిపోరట్స్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి)తో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(సిడబ్ల్యూఐ)ను కలవరపెడుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చేయుతనిచ్చేందుకు ఐసిసి ఈ ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను విండీస్‌కు ఇచ్చింది. కానీ.. విండీస్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లనున్నాడు.

ఈ టోర్నీలోని సూపర్ 8 మ్యాచ్‌లన్నింటికీ వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 20న భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరిగే ఒక్క మ్యాచ్ తప్ప అన్నింటికీ వర్షం ముప్పు ఉందని తెలిపింది. ఇక బార్బోడోస్ స్టేడియం వేదికగా గురువారం భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సమయంలో కూడా చిన్నపాటి జల్లు పడనున్నట్లు సమాచారం. ఇక మిగతా ఈ స్టేడియంలో జరిగే ఇతర మ్యాచ్ల సమయంలో 40 నుంచి 55 శాతం వర్షం పడే అవకాశం ఉంది. సెయింట్ లూసియాలో జరిగే మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని. ఈ మైదానంలో జరిగే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించనుందని తెలిపింది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. లీగ్ దశలో కొన్ని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. భారత్‌కెనడా, ఇంగ్లండ్ స్కాట్లాండ్, యూఎస్‌ఏఐర్లాండ్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. వర్షం కారణంగా పాకిస్థాన్ టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News