- Advertisement -
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేపు(ఆదివారం, డిసెంబర్ 4) కూడా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో చెన్నైతో పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాలను గుర్తించి.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించి, సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
- Advertisement -