- Advertisement -
పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని, ఇది శుక్రవారం ఉదయం తమిళనాడు, ఎపి మధ్య తీరాన్ని దాటవచ్చని చెన్నై వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. దీని ఫలితంగా తమిళనాడు, ఎపి తీరం వెంబడి గంటకు45 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతో పాటు కొన్ని చోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఆ తర్వాత ఇది క్రమేపీ బలహీనపడుతుందని తెలిపింది. ఇదిలా ఉండగా వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి చెన్నైతో పాటుగా కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అధికారులు ఈ ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈ నెల 1వ తేదీనుంచి తమిళనాడులో మామూలుకన్నా 61 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి.
- Advertisement -