Monday, December 2, 2024

కుండపోత వర్షాలు.. తమిళనాడు, పుదుచ్చేరి అతలాకుతలం

- Advertisement -
- Advertisement -

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో భారీ వరదలు తమిళనాడును ముంచెత్తాయి. రోడ్లలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. వర్షాల కారణంగా తిరువణ్ణామలై, విల్లుపురం అతలాకుతలం అయ్యాయి. తిరువణ్ణామలైలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 30 మందికి పైగా కొండచరియల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇక, పుదుచ్చేతోరిలోనూ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడిన ఫెంగల్‌ తుఫాన్ కారనంగా.. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోనూ ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో చిరుజల్లులు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News