Wednesday, March 26, 2025

అన్నదాత..ఆగమాగం

- Advertisement -
- Advertisement -

11వేల ఎకరాల్లో పంట నష్టం

అధికారుల ప్రాథమిక అంచనా 13 జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు పంట నష్టంపై గ్రామాలవారీగా
సర్వే అధికారులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వడగండ్లు, ఈదురుగాలుల కారణంగా వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగిపడడం, కరెంట్స్తంభాలు కూలడంతో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వడగండ్లు, ఈదురుగాలుల కారణంగా వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగిపడడం, కరెంట్స్తంభాలు కూలడంతో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం అంచనాలో వ్యవసాయ, విద్యుత్ శాఖ ఆఫీసర్లు నిమగ్నమయ్యాయి. అకాలవర్షం అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది.

తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వడగండ్లు ,ఈదురు గాలుల కారణంగా వరి, మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల, వడగండ్ల కారణంగా కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాలలో 336 ఎకరాల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 321 ఎకరాల మొక్కజొన్న, 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. చొప్పదండి రామడుగు, కరీంనగర్ కొత్తపల్లి, మండలాలలో 213 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా రామడుగు మండలంలో పంట నష్టం ఎక్కువ జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే సాగు నీరు లేక అల్లాడుతున్న రైతన్నలను అకాల వర్షాలు నిండాముంచాయి. ట్యాంకర్లను తెచ్చి మరీ పంటలను కాపాడుకుంటుంటే ఈ వర్షాలు కాస్త నేలపాలు చేశాయి. ముఖ్యంగా వరి, మక్కజొన్న పంటలు నేలకొరిగాయి.

అన్నదాతకు అకాల కష్టం : పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. మక్కజొన్నతో పాటు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బ కొట్టాయి. చేతికొచ్చిన పంట ఎటూ కాకుండా పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు…వడగండ్లు, ఈదురుగాలుల వంటి ప్రకృతి వైపరిత్యం రైతన్నలకు గుండెకోతను మిగిల్చింది. గత రెండు రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలకు అనేక జిల్లాల్లో విపరీతంగా పంట నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈదురుగాలులకు విద్యుత్ లైన్లు నేతలకొరిగాయి. మరికొద్ది రోజుల్లో కోతలకు వచ్చే వరిపంట దెబ్బతింది. మామిడి పిందెలు,కాయలు నేలరాలాయి. మొక్కజొన్న, కర్బూజ పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

చాలా జిల్లాల్లో పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రైతులకు అకాల వర్షాలకు కనీటిపర్యంతం అవుతున్నారు. జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ యంత్రంగం రంగంలోకి దిగింది. ప్రధానంగా మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు అధికారులు గుర్తించిన ప్రాథమిక అంచనాల మేరకు 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లుగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు నిర్దారణకు వచ్చారు. మరో రెండు మూడు రోజుల పాటు పంట నష్టం సర్వే పనులు కొనసాగించనున్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై గ్రామాల వారీగా సమగ్రంగా సర్వే చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుకు నష్టం జరిగిన నివేదికలో సమగ్రంగా పొందుపరచాలని సూచించారు.

రాష్ట్ర వ్యవసాయశాఖకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాలో సుమారు 1,825 మంది రైతులు, 519 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అలాగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 350 ఎకరాల్లో పంటనష్టంతో 159 మంది రైతులు ఆర్ధికంగా కుదేలైయ్యారు. ఇందులో ఎక్కువగా ఆసిఫాబాద్ జిల్లాలో 598 ఎకరాల్లో జరిగిన నష్టం వల్ల 279 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 336 ఎకరాల్లో జరిగిన పంట నష్టం వల్ల 226 మంది రైతులు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో దాదాపు 135 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 78 ఎకరాల్లో జొన్న, 28.2 ఎకరాల్లో మామిడి, 18 ఎకరాల మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన పంటనష్టం వివరాలపై అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు.

రెండు గ్రామాల్లోనే 265 ఎకరాల్లో నష్టం : అకాల వర్షం రైతులను తీవ్రంగానే దెబ్బకొట్టింది. వాడి, దమ్మన్నపేట్ గ్రామాల్లోనే 174 మంది రైతులకు చెందిన 265 ఎకరాల వరి పంట దెబ్బ తిన్నాయి. వాడి, మద్దుల్ తండా, సీతాయిపేట్, హోన్నాజీపేట్ తదితర ప్రాంతాల్లో దెబ్బ తిన్న వరి పంటలను రూరల్ ఏడీఏ ప్రదీప్‌కుమార్, ఏవో వెంకటేశ్ పరిశీలించారు. పెట్టుబడి ఖర్చు కూడా మిగలకుండా పోయిందని, తమను ఆదుకోవాలని రైతులు వ్యవసాయాధికారులకు మొరపెట్టుకున్నారు. పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్, రూరల్ నియోజకవర్గాల్లో వడగండ్లు, ఈదురుగాలులతో పంటలకు నష్టం జరిగింది. బలమైన గాలులకు ధాన్యం గింజలు నేలరాలాయి. నిన్నా మొన్నటి వరకూ సాగునీటి కష్టాలను తట్టుకుని పంటలను కాపాడుకున్న రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ధాన్యం అమ్ముకుని నష్టాల నుంచి బయట పడుతామనుకునే లోపే అకాల వర్షం ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. బోధన్, కోటగిరి, పోతంగల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో పంట నష్టం సంభవించింది.

13 గ్రామాల్లో 336 ఎకరాల్లో పంట నష్టం : అకాల వర్షం, వడగండ్ల వాన కారణంగా కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాల్లో 336 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 321 ఎకరాల మక్కజొన్న, 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. చొప్పదండి మండలం కాట్నేపల్లి, రుక్మాపూర్, రామడుగు మండలం వెలిచాలి, వన్నారం, కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్, చామన్పల్లి, నగనూరు, మగ్ధూంపూర్, ఇరుకుల్ల, చర్లబూత్కూర్, కొత్తపల్లి మండలం నాగులమల్యాల, కొత్తపల్లిలో సుమారు 213 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా రామడుగు మండలం వెలిచాలలో 83 రైతులకు చెందిన 120 ఎకరాల మక్కజొన్న నేలవాలినట్లు తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగండ్ల వాన కారణంగా 598 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు. కాగజ్నగర్, చింతలమానేపల్లి, రెబ్బెన మండలాల్లో ఎక్కువ నష్టం ఉన్నట్లు తేల్చారు. 16 గ్రామాల్లో 271 మంది రైతులకు చెందిన మక్కజొన్న, మామిడి, వరి, కర్బూజ పంటలు దెబ్బతిన్నాయి. మానిక్‌గూడ, గోవింద్‌పూర్ గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

మెదక్ జిల్లాలో 142 మంది రైతులకు చెందిన 131.2 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 78 ఎకరాల్లో జొన్న, 28.2 ఎకరాల్లో మామిడి, 18 ఎకరాల మక్కజొన్న, ఏడు ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో 25 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించారు. గాంధారి మండలం రాంలక్ష్మన్పల్లి, మాత్సంగెం, భిక్కనూరు మండలం అంతంపల్లి, రామేశ్వరపల్లి శివారు, సదాశివనగర్ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డి శివార్లలో మక్క పంట నెలకొరిగింది. శనివారం సాయంత్రం దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి మండలాల్లో కొద్ది పాటి వర్షం పడగా, రాజంపేటలో వడగండ్లు పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో 158 మంది రైతులు 335 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో 80 ఎకరాల్లో వరి, 255 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు తేల్చారు. మరో ఇరవై రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న మామిడికాయలు గాలివానకు రాలిపోయాయి.

హాజీపూర్ మండలం సబ్బెపల్లి, రాపల్లి, ధర్మారం, బుగ్గగట్టు గ్రామాల్లో మామిడితోటల్లో కాయలు రాలిపోయాయి. కొండపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో వరి, నర్సింగాపూర్, ధర్మారం గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. హాజీపూర్ మండలంలో సుమారు 80 ఎకరాల మేర వరి, 50 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగంతో పాటు తుమ్మన్పల్లి, బొప్పన్పల్లి, సంఘం (కె), కంబాలపల్లి, గుంత మర్పల్లి, జీర్లపల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడడంతో చేతికొచ్చిన జొన్న నేలవాలింది. బొప్పన్పల్లిలో ఉల్లి పంట దెబ్బతింది. రహదారిపై చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జొన్నతో పాటు శనగ, టమాటా, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జహీరాబాద్ మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల కారణంగా చెట్లు,విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

భారీ వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో గోడ కూలడంతో ఎస్.లచ్చయ్య అనే వ్యక్తికి చెందిన 12 గొర్రెలు చనిపోగా, మరో 15 గొర్లు తీవ్రంగా గాయపడ్డాయి. వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ స్థాయిలో వడగండ్లు పడడంతో కౌలు రైతు మంగళి రమేశ్కు చెందిన రెండు ఎకరాల మిరప తోట పూర్తిగా దెబ్బతింది. నిజామాబాద్ జిల్లో వడగండ్లు, వర్షం కారణంగా 1,812 మంది రైతులు నష్టపోయారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ మండలంలో అత్యధికంగా 506 ఎకరాల్లో, ధర్పల్లి మండలంలో 324, బోధన్ పరిధిలోని నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి 84 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. అలాగే సిరికొండ మండలంలో 506 ఎకరాల్లో, ధర్పల్లి మండలంలో 324, బోధన్ మండలంలో 42, నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి మొత్తం 884 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News