Friday, November 15, 2024

బలపడిన అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు

Heavy rains in Tamil Nadu today

మనతెలంగాణ/హైదరాబాద్:  బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని వారు పేర్కొన్నారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నేటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News