Saturday, November 16, 2024

ఈదురు గాలి బీభత్సం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 14మంది మృతి

ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు
హైదరాబాద్‌ను వణికించిన ఉరుములు, మెరుపుల
వర్షం కొట్టుకుపోయిన ఇళ్ల పైకప్పులు
నేల కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
మన తెలంగాణ/హైదరాబాద్/శేరిలింగంపల్లి/ నాగర్‌కర్నూల్ : గత నాలుగై దు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలపై ఆదివారం ఒక్కసారిగా ఈదురు గాలి విరుచుకుపడింది. వాతావరణం చల్లబడిందని ఊపిరి పీల్చుకునేలోగానే నానా బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ న గరంలోనూ, శివారు ప్రాంతాలతో సహా రా ష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల తో కూడిన ఈదురు గాలి, గాలి వాన ప్రళ యం సృష్టించినంత పని చేసింది. దీంతో కేవలం రెండు మూడు గంటల్లో సుడిగాలి ప్రభావానికి చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ సరఫరా ఎక్కడిక్కడే నిలిచిపోయింది. గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి.

పిడుగు పడి 10 ఏళ్ల బాలుడితో సహా పలు సంఘటనల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో గాలివాన సృష్టించిన బీభత్సానికి వేరువేరు ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ శివారులో నిర్మాణంలో ఉన్న డెయిరీ షెడ్డు భారీ ఈదురుగాలులకు రేకులు ఎగిరిపడి గోడ కూలడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాడూరు మండల కేంద్రానికి చెందిన షెడ్డు యజమాని రైతు బెల్లే మల్లేష్ (38), ఆయన కుమార్తె బెల్లె అనూష (10), పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన కూలీలు సల్వాజీ రాములు (35) అతని భార్య సల్వాజి చెన్నమ్మ (34) అక్కడికక్కడే మృతి చెందగా బిల్లె రాజు (14) బెల్లే మల్లేష్ భార్య పార్వతమ్మ ,మెస్ట్రీలు చిన్న నాగులు, కురుమయ్య అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Wind and rain disaster in Nagar Kurnool

వీరిలో చిన్న నాగులు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన దండు లక్ష్మణ్ (12) అనే బాలుడు పిడుగు పడి మృతి చెందాడు. అదేవిధంగా నాగర్ కర్నూల్ శివారులోని మంతటి గడ్డ వద్ద ప్రధాన రహదారి పై శ్రీశైలం నుంచి వికారాబాద్ కు వెళ్తున్న తూఫాన్ వాహనంపై గాలివాన వస్తున్న క్రమంలో రేకులపై ఉన్న ఇటుకలు వాహనంపై పడి తీవ్రంగా గాయపడిన వికారాబాద్ జిల్లాకు చెందిన వేణు (38) అనే తుఫాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గo మధ్యలో మృతి చెందాడు. తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య అతని కుమారుడు లక్ష్మణ్ (13) గ్రామ సమీపాన ఉన్న పొలాల్లోకి మేకలను మేపడానికి వెళ్లారు.

సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో తన కుమారుడిపై ఎక్కడ పిడుగులు పడతాయోనని దగ్గరలో ఉన్న చెట్టుకిందకు వెళ్లు అని తండ్రి చెప్పడంతో లక్ష్మణ్ ఒక చెట్టు కిందకు వెళ్లాడు. దీంతో ఆ బాలుడు వెళ్లి చెట్టుకింద ఉండగా పిడుగు పడడంతో బాలుడు వద్ద ఉన్న సెల్‌ఫోన్ పేలిపోవడంతో అక్కడిక్కడే ప్రాణం పోయింది. కాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరిపై భారీ వృక్షం కూలి ఒకరు సంఘటన ప్రదేశంలో మృతి చెందగా మరొకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (60), సమీపంలోని ధర్మారెడ్డి గూడెంకు చెందిన ధనుంజయ్ (44) ద్విచక్ర వాహనంపై అల్వాల్‌లో తమ బందువులకు మామిడి పండ్లు ఇచ్చేందుకు బయలుదేరారు.

భారీ వర్షానికి కీసర నుంచి శామీర్‌పేట రహదారిలో తిమ్మాయిపల్లి గ్రామం వద్ద చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డి అక్కడి కక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన ధనుంజయ్‌ను చికిత్స నిమిత్తం ఇసీఐఎల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో పౌల్ట్రీఫామ్ గోడ కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్టకు చెందిన భాగమ్మ, తూప్రాన్ మండలం ఘనపూర్‌కి చెందిన గంగా గౌరి శంకర్‌లు కుటుంబంతో కలిసి మండల పరిధిలోని క్షీరసాగర్ గ్రామంలోని తమ బందువు బలిజ శ్రీనివాస్ ఇంటికి చుట్టంగా వచ్చారు. శ్రీనివాస్‌కి చెందిన వ్యవసాయ పొలానికి వెళ్లి వారు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో వర్షంలో తడవకుండా ఉండేందుకుగాను దగ్గరలో ఉన్న పౌల్ట్రీఫామ్ గోడ వద్దకు వెళ్లి నిలబడ్డారు. ఈదురు గాలుల తీవ్రతకు పౌల్ట్రీఫామ్ గోడ కూలి బాధితులపై పడింది. గంగాగౌరి శంకర్, భాగ్యమ్మలు అక్కడిక్కడే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి బెంగాల్‌కు చెందిన మమ్జుల్ షేక్ (33) అనే మేస్త్రీ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈదురు గాలి ధాటికి వణికిన భాగ్యనగరం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. హయత్‌నగర్ ప్రాంతంలో రేకులు, గుడిసెలు సైతం ఎగిరిపోయాయి. ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాచారం, హబ్సీగూడ, తుర్కయాంజాల్, నల్లకుంట, కాచిగూడ, మల్కాజ్ గిరి, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజిగిరి, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరానిలిచిపోయింది. హయత్‌నగర్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు, గుడిసెలు ఎగిరిపోయాయి. తూర్పు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్, సరూర్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. నాగారం, కీసర, ఈసిఐఎల్, మౌలాలీ, దమ్మాయిగూడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి.

హఫీజ్ పేట్‌లో తీవ్ర విషాదం

ఓల్డ్ హఫీజ్ పేట్ సాయినగర్‌లో గాలి వాన బీభత్వానికి ఒక ఇంటి బాల్కని కూలి పక్కన ఉన్న రేకుల ఇంటిపై పడింది దీంతో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి సమద్ (3) మీద గోడ శిథిలాలు పడి బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న రషీద్ (45 )పై ఇటుకలు పడి గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు గాయాలైన బాలుడు, రషీద్ ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడుతో పాటు రషీద్ కూడా మృతి చెందాడు.

చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి రోడ్లు అస్తవ్యస్తం

నల్గొండలో భారీగా వీచిన ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఈదురుగాలుల దాటికి పానగల్ ఫై ఓవర్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్ అద్దాలు ధ్వంసం అయ్యింది. అటు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. బోర్లం, తాడ్కోల్, బుడిమి, కొత్తబాది తదితర గ్రామాల్లో వీచిన ఈదురు గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బోర్లం గ్రామంలో విద్యుత్తు స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఆదివారం వారపు సంత సందర్భంగా రైతులు వ్యాపారస్తులు మార్కెట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పలు దుకాణాలపై ఉన్న టార్పాలిన్ లు గాలి బీభత్సానికి చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. బొంరాస్ పేట్, దుద్యాల మండలాలల్లో బలమైన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News