Wednesday, January 22, 2025

వ్యవసాయం డబుల్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వాతావరణం అనుకూలించింది. రాష్ట్రమంతటా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 33జిల్లా ల్లో గత వారం రోజుల కిందట 11జిల్లాలు లో టు వర్షపాతంలో ఉండగా , రుతుపవనాల వి స్తరణ,ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో బుధవారం నాటికి రాష్ట్రంలోని 30జిల్లాల్లో పంటల సాగుకు అనువైన సాధారణ వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో అత్యధికంగా, మరికొన్ని జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయి. కేవ లం మూడు జిల్లాల్లో అది కూడా ఉత్తర తెలంగాణలోని కొమరంభీమ్ ఆసీఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే లోటు వ ర్షపాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో సమృద్దిగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయరంగం పంటల సా గులో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సా గుతోంది. వారం రోజుల్లోనే పంటల సాగు వి స్తీర్ణం భారీగా పెరిగిపోయింది. రైతులు వ్యవసాయపనుల్లో నిమగ్నమయ్యాయి. గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలకు కూ డా చేతినండా పనిదొరికింది. నీటివనరులు అందబాటులో ఉన్న చోట వరినార్లు పోస్తున్నా రు. మిగిలిన పంటలకు సంబంధించి విత్తనా లు నాటుకునే పనులు ఊపందుకున్నాయి. ఈ నెల రెండవ వారం నుంచే పొలాల్లో విత్తనాలు వేసుకునే పనులు మొదలైనప్పటికీ అవి మూ డవ వారంలో మరింతగా పుంజుకున్నాయి.

వారం రోజుల వ్యవధిలోనే సాగు విస్తీర్ణం దా దాపు రెట్టింపు అయింది. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ కింద ఇప్పటి వరకూ 38,06,097 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు పడ్డాయి. ఈ సీజన్ లో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 1,31, 02,372 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించాలని ప్రభుత్వం ప్రాధమిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ సమయానికి 18,22,589 లక్ష ల ఎకరాల్లో పంటలు సాగులోకి రావాల్సివుం ది. అయితే వాతావరణం పూర్తి స్థాయిలో 20 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు సాగులోకి వచ్చాయి. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఈ స యయానికి 4,18,039 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. గత ఏడాదికంటే ఈసారి వ్యవసాయరంగం మంచి వూపుమీద ఉంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణపు లక్ష్యా ల్లో ఇప్పటికే 29.05శాతం మేరకు పంటలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో పత్తి సాగుకు వాతావరణం పూర్తి అనుకూలంగా మారింది. దీంతో వేసవి దుక్కులు దున్ని పెట్టుకుని సేద్య పు పనులు పూర్తి చేసుకున్న రైతులు తొలకరి వర్షాలకే పత్తి విత్తనం నాటుకునే పనిలో ప డ్డారు. రాష్ట్రంలో ఈ ఏడాది 50.48లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు లక్షంగా ఎంచుకో గా, ఇప్పటికే 56.61శాతం విస్తీర్ణంలో పత్తినాటుకునే పనులు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో ఇ ప్పటివరకూ 14.10లక్షల ఎకరాల్లో పత్తి విత్త నం పడాల్సివుంది.

అయితే ఇప్పటికే 28.58లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. గత ఏడా ది వాతావరణం అనుకూలించక తొలకరి వ ర్షాలు ఆలస్యం కావటంతో ఈ సమయానికి కేవలం 3.24లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి వి త్తనాలు వేసుకోగలిగారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ కింద ప్రధాన ఆహార ధాన్య పంటలకు సంబంధించిన లక్ష్యాల్లో నీటివనరుల లభ్యత ఆధారంగా 57.18లక్షల ఎకరాల్లో వరిసాగును ప్రాధమిక లక్షంగా ప్రభుత్వం నిర్దేశించింది. వర్షాధారం, నీటివనరుల లభ్యత ఆధారంగా, బోర్ల కింద ఇప్పటికే పలు జిల్లాలో 72243 ఎకరాల్లో వరినార్లు పోసుకున్నారు. వర్షాధారంగా జొన్న పంట 70వేల ఎకరాలు సాగు లక్షంగా పెట్టుకోగా , ఇప్పటివరకూ 17521 ఎకరాల్లో రైతులు జొన్న విత్తనం వేశా రు.మొక్కజొన్న పంట 6.09లక్షల ఎకరాల్లో సాగు లక్షంగా పెట్టుకోగా, ఇప్పటివరకూ 1, 25,235 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం పడింది.మరో 20ఎకరాల్లో రాగి పంటలు సాగయ్యాయి. రాష్ట్రంలో పప్పుధాన్య పంటల విస్తీ ర్ణం వేగంగా పెరుగుతూ వస్తోంది. పప్పుధాన్యాలకు మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌ను దృష్టి లో ఉంచుకుని ఈ సీజన్‌లో రైతులు పప్పుధా న్య పంటలకు మొగ్గుతున్నారు. ప్రభుత్వం 8. 52లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటల సాగు ను లక్షంగా పెట్టుకుంది. అందులో కంది పం ట 7.11లక్షల ఎకరాలు

, పెసర్లు 1.01లక్షల ఎకరాలు, మినుము 35635 ఎకరాలు, ఉలవ పంట 1076 ఎకరాలు సాగు లక్షంగా పెట్టుకుంది. పప్పుధాన్య పంటల్లో ఇప్పటికే 1749 47ఎకరాల్లో కంది, 23979ఎకరాల్లో పెసర విత్తనాలు పడ్డాయి. మరో 3398ఎకరాల్లో మి నుము పంట వేశారు. ఇప్పటివరకూ పప్పుధాన్య పంటల సాగువిస్తీర్ణం 2,02,360ఎకరాలకు చేరుకుంది.ఈ సీజన్‌లో అన్ని రకాల నూనెగింజ పంటలు కలిపి మొత్తం 5.48లక్షల ఎకరాల్లో సాగులోకి తేవాలని వ్యవసాయశాఖ లక్షంగా పెట్టుకుంది. అందులో వేరుశనగ 28464 ఎకరాలు, సోయాబీన్ 4,29, 477 ఎకరాలు లక్షంగా పెట్టుకుంది. రాష్ట్రం లో ఇప్పటివరకూ 2,06,187 ఎకరాల్లో నూనెగింజ పంటలు సాగులోకి వచ్చాయి.రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి తర్వాత స్థానం చెరకు పంట ఆక్రమించింది. ఈ సీజన్‌లో మొ త్తం 60వేల ఎకరాల్లో చెరకు సాగును ప్రభు త్వం లక్షంగా పెట్టుకుంది. ఇప్పటికే 4318 ఎకరాల్లో చెరకు విత్తనం నాటేశారు.మార్కెట్‌లో పొగాకు పంటకు డిమాండ్ పెరిగింది. వర్జీనీయా పొగాకు ధర రికార్డు స్థాయిలో కిలో రూ.352కు పెరిగిపోయింది.ఈ ధరలను దృష్టి లో ఉంచుకుని ఈ సారి రాష్ట్రంలో పాగాగు సాగు విస్తీర్ణం కూడా సాధారణంకంటే అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News