Wednesday, January 22, 2025

నేడు, రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉరుములు, మెరుపులతో పాటు వేగంతో ఈదురుగాలులు

మన తెలంగాణ/హైదరాబాద్: నేడు, రేపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల రాష్టంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రానున్న ఐదురోజులు ఉరుములు, మెరుపులుతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నేడు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో…

నేడు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మ హబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 9వ తేదీన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News