Monday, December 23, 2024

తెలంగాణలో 19జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగల 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర దక్షిణ విదర్భ నుండి మరఠ్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారబాద్ ,మమబూబ్‌నగర్, వనపర్తి , నారాయణపేట, జోగులాంబగద్వాల, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ ,జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ , మేడ్చెల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. మంగళవారం రాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జనగాం జిల్లా రఘునాధపల్లిలో 39.8 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో మనోహరాబాద్‌లో 28.8, వెల్దండలో 21.3, కడ్తాల్‌లో 20.8, గండిపల్లిలో 19.3, పుట్టపహడ్‌లో 18.8, రామారంలో 15.8, ఇస్లాంపూర్‌లో 15.8, బేగంపేట్‌లో 15.5 చందూర్‌లో 15, రాపోల్‌లో 13, వడ్డెపల్లిలో 12.5, గుడపూర్‌లో 11.5, రెబ్బెనలో 11.5, రాజోలిలో 11, బోల్లంపల్లిలో 10.8 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News