Sunday, December 22, 2024

ఈ నెల 30 నుంచి తెలంగాణలో అతి భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఈ నెల 30నుంచి భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.. ఈనెల 30 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే జాబితాలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పడతాయని వెల్లడించింది.

అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి ,మెదక్,కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 31 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.సెప్టెంబర్ ఒకటో తేదీన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తలమడుగులో 12మి.మి వర్షం :
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా అదిలాబాద్‌ఖ జిల్లా తలమడుగులో 12.మి.మి వర్షం కురిసింది. బజార్‌హత్నూర్‌లో 6.6, తామ్సిలో 6.6 ఇచ్చోడలో 5.5, బోధ్‌లో 4మి.మి వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జీడిమెట్ల, షాపూర్ నగర్ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News