Wednesday, January 15, 2025

తెలంగాణలో భారీ వర్షాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుసున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవడంతో అతలాకుతలం అవుతోంది. ఎపిలో వానలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ప్రమాదస్థాయిని ధాటి ప్రవహిస్తున్నాయి. ఎపిలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్ట్ 31వ తేదీ, సెప్టెంబర్ ఒకటో తేదీన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. వాయుగుండ ఆదివారం విశాఖపట్నం-గోపాల్ పూర్ ప్రాంతాల మధ్య తీర దాటనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. లోతట్ట ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News