తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మళ్లీ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి.
ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొమరం భీమ్, నిర్మల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. పగటిపూట వాతావరణం సాధారణంగా ఉంటుంది. సాయంత్రానికి వాతావరణం మారిపోతుంది.
తెలంగాణ మీదుగా దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మళ్లీ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు