Monday, December 23, 2024

ఆ జిల్లాల్లో భారీ వర్షాలు… ఎవరు బయటకు రావొద్దు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాబోయే రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల దృష్ట్యా అనవసరంగా బయటకు రావొద్దని జిహెచ్‌ఎంసి సూచనలు చేసింది. నగర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని, సహాయ చర్యలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిహెచ్‌ఎంసిలోని డిఆర్‌ఎస్ విభాగం తెలిపింది. కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 9000113667కు పోన్ చేయాలని సూచించారు.

Also Read: కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన.. తల్లి ప్రేమ (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News