Wednesday, January 22, 2025

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. సిర్పూర్(టి)లో అత్యధికంగా 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్లలో నిన్నటి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News