- Advertisement -
హైదరాబాద్: రానున్న రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈరోజు(శనివారం) రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా, గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో కుండపోత వానలు పడడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
- Advertisement -