Sunday, December 22, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది.

పలు జిల్లాల్లో 11-20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో వర్షాలు పడనున్న ఈక్రమంలో ఆయా జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News