- Advertisement -
తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ళతో కూడిన భారీ వర్షం పడొచ్చని హెచ్చరించింది.
మెదక్, కామారెడ్డి, ములుగు, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో గంటకు నలభై, యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక, హైదరాబాద్‌లో ఇవాళ, రేపు చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
- Advertisement -