Saturday, December 21, 2024

ఏడు జిల్లాలకు భారీ వర్షాలు .. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకైన ప్రభావం చూపుతున్నాయి. రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అల్పపీడనం ఎర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6కి.మి ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం నాడు రాష్ట్రలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండి తెలిపింది.

అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 50కి.మి వేగంతో వీచే బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి ,హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి , మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడాఅక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఖిలా వరంగల్‌లో 96.7మి.మి వర్షం 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నాడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ హదరాబాద్ నగరం పరిధిలో కుండపోతగా వర్షం కురిసింది. పలు మార్గాల్లో రోడ్లపై వర్షపు నీరు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా ఖిలావరంగల్ లో 96.7మి.మి వర్షం కురిసింది. నాగర్‌కర్నూలు జిల్లా వంగూర్‌లో 78.4, నిర్మల్ జిల్లా భైంసాలో 74.5, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో 72.3,దేవరకొండలో 67, రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెంలో 67.5, నిజామాబాద్ జిల్లా దొనకేశ్వర్‌లో 67, గట్టులో 59, పెబ్బేర్‌లో 59, భీమదేరవపల్లిలో 58మి.మి వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్‌లో 35.8, చార్మినార్‌లో 31.2, బండ్లగూడలో 29, మారేడ్‌పల్లి 27.7, అంబర్‌పేటలో 22.2, సరూర్‌నగర్‌లో 45.9 మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News