Thursday, January 23, 2025

మూడు రోజుల పాటు భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Delhi Heavy rains in Telangana next 3 daysrain

మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఝార్ఖండ్ పరిసరాల్లో ఉత్తర ఒరిస్సాతోపాటు దానికి ఆనుకొని ఉన్న దక్షిణ జార్ఖండ్ అండ్ గాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోందని, అలాగే ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశకు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ వివరించింది. స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నైరుతి భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులోకి గాలులు….

బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో జార్ఖండ్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులోకి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన….

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 20, మేడ్చల్ మల్కాజిగిరిలో 13, రంగారెడ్డిలో 12, హైదరాబాద్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

ఈ సారి ఆదిలాబాద్‌లో తక్కువ వర్షపాతం

అయితే ప్రతిసారి అధికంగా కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుండగా ఈసారి మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో (ఈ సీజన్‌లో) తక్కువ వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవగా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో నామమాత్రంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. (ఈనెల 03వ తేదీ వరకు) కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు సగటున కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే 29 శాతం అధికంగా నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో సగటు కంటే 6 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ సీజన్‌లో ఆదిలాబాద్ జిల్లాలో 231 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 223 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కాగా, మంచిర్యాల జిల్లాలో 217 మిల్లీమీటర్లకుగాను 231 మి.మీ., నిర్మల్ జిల్లాలో 208 మి.మీలకు గాను 221 మి.మీలు, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 220 మి.మీలకుగాను 285 మి.మీల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News