నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వానలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్థరాత్రి నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి, నేడు దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుందని అధికారులు వివరించారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఈ రోజు గంగేటిక్ పరిసర ప్రాంతాల్లో ఉండి సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ వరకు కొనసాగుతుందని వారు వివరించారు. దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన….
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 97 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 82, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 74, సిద్దిపేటలో 57, జగిత్యాలలో 54, నిజామాబాద్‌లో 47, వరంగల్ అర్భన్‌లో 35, నిర్మల్‌లో 37, ఆదిలాబాద్‌లో 32, కరీంనగర్‌లో 42,