- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయిగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
తెలంగాణలో సోమవారం భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. అలాగే ఏపీలో ఉమ్మడి చిత్తూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
- Advertisement -