Sunday, December 22, 2024

మూడ్రోజులు 9 జిల్లాలకు భారీ వర్షసూచన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది.దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులకు సంబంధించి రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనాలున్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.నిర్మల్‌లో 22.4 మి.మి , భైంసాలో 17.5, ఖానాపూర్‌లో 13.2, సిద్దిపేటలో 10.3, గంగాధరలో 8.2, బోధ్‌లో 7.2, బాన్స్‌వాడలో 6,సారంగాపూర్‌లో 6, బీమ్‌గల్‌లో 6, కూసుమంచిలో 5.8 మి.మి చోప్పున వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News