Saturday, November 23, 2024

మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఐఎండి

- Advertisement -
- Advertisement -

Heavy rains in three states: IMD

న్యూఢిల్లీ : ఈనెల 18 న తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం తెలియచేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం గురువారం పశ్చిమ దిశగా ప్రయాణించి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తీరాలకు చేరుకుంటుందని అంచనా వేసింది. కర్ణాటక తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా మరో అల్పపీడనం కొనసాగుతుందని , రాబోయే 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుందని తెలియచేసింది. కర్ణాటక తీరంలో తూర్పుమధ్య అరేబియా సముద్రం మీదుగా మరో అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. తూర్పుమధ్య అరేబియా సముద్రం మీదుగా దక్షిణ మహారాష్ట్ర, గోవా తీరాల మీదుగా ఉత్తర కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి , కారైకాల్, కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజులు, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం తమిళనాడు , పుదుచ్చేరి, కారైకాల్, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 18న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ కోస్తాంద్రలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణాంధ్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు 40 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News