Thursday, December 12, 2024

తిరుమలలో భారీ వర్షం..

- Advertisement -
- Advertisement -

తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తిరుమల కొండపై బుధవారం ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా చలితీవ్రత కూడా పెరిగింది. దీంతో అధికారులు తిరుమలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోగర్భం, పాపవినాశనం జలాశయం పూర్తిగా నిండటంతో అధికారులు నీటికి దిగువకు వదులుతున్నారు. మరోవైపు, తిరుపతిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక, తమిళనాడులోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News