Friday, November 22, 2024

నేపాల్‌లో భారీ వర్షాలకు 88 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Heavy rains kill 88 in Nepal

ఖాట్మాండ్ : నేపాల్‌లో భారీ వర్షాలకు వరదలు ఉప్పొంగి, కొండచరియలు విరిగి పడిన సంఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 88 కి చేరింది. మంత్రిత్వశాఖ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం ఆయా సంఘటనల్లో ఇప్పటివరకు 30 మంది గల్లంతు అయ్యారు. తూర్పు నేపాల్ లోని పంచతార్‌లో అత్యధికంగా 27 మరణాలు నమోదయ్యాయి. ఇలం, దోతి జిల్లాల్లో 13 మంది మృతి చెందారు. కాలికోట్, బైలాడి, దదల్లురా, బజాంగ్, హుమ్లా సోలుబుంటు, ప్యూథాన్, థన్‌కుట, ములాంగ్, ముస్సోరి, ఉదయ్‌పూర్‌తోసహా 15 ఇతర జిల్లాల్లో వర్షాలతో జనం మృతి చెందారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో పరదలు పొంగి ప్రవహిస్తున్నాయి.

అనేక చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇదిలా ఉండగా హుమ్లా జిల్లాలో చిక్కుకున్న విదేశీ పర్యాటకులను వెంటనే రక్షించాలని, నేపాల్ సాయుధ పోలీస్ ఫోర్స్,నేషనల్ ఇన్వెస్టిగేషన్ విభాగం, ఆర్మీని ఆ దేశ హోంమంత్రి బాలకృష్ణ ఖండ్ ఆదేశించారు. నలుగురు స్లోవినీయన్ టూరిస్టులు , ముగ్గురు గైడ్లతో సహా 12 మంది నఖ్లా వద్ద చిక్కుకున్నారు. లిమిలో ట్రెక్కింగ్ పూర్తి చేసిన తరువాత సిమికోట్ తిరిగి వస్తుండగా వారు చిక్కుకు పోయారని హుమ్లా ముఖ్యజిల్లా అధికారి గణేష్ ఆచార్య పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News