Wednesday, January 22, 2025

ఈ ఏడాది భారీ వర్షాలు!

- Advertisement -
- Advertisement -

రైతులకు శుభవార్త తెలిపిన ఐఎండి

మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో వ్యవసాయరంగానికి ప్రత్యేకించి రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపనాలు దేశంలోకి సకాలంలో ప్రవేశించటంతోపాటు సమృద్దిగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్‌సెప్టెంబర్ మధ్య కాలంలో భారి వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో బలహీనపడుతోందని , జూన్ నాటికి ఇది పూర్తిగా క్షీణిస్తుందని తెలిపింది. దీంతో ఈ ఏడాది కంటే వచ్చే సీజన్‌లో మెరుగైన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని ఐంఎండి పేర్కొంది.

రాష్ట్రంలో పొడివాతావరణం:
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వాతావరణం పోడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.కింది స్థాయిలో గాలులు ఆగ్నేయ , దక్షిణ దిశల నుండి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నట్టు తెలిపింది. రాగల మూడు రోజలు పొడివాతవరణం ఉంటుందనితెలిపింది.రాష్ట్రంలో బుధవారం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.భద్రాచలంలో అత్యధికంగా 35.6డిగ్రీలు నమోదయ్యాయి. అదిలాబాద్‌లో 35, ఖమ్మం ,మహబూబ్ నగర్‌లో 34.4 హైదరాబాద్‌లో 33.4, నిజామబాద్‌లో 33.3, రామగుండంలో 33, నల్లగొండలో 33, మెదక్‌లో 32.6, హన్మకొండలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News