Sunday, December 22, 2024

మరో మూడు రోజులపాటు దంచి కొట్టనున్న వానలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. పైగా చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా వానలు పడుతున్నాయి.

రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఉత్తర కోస్తా అంతటా ఓ మోస్తరు వానలు పడనున్నాయి. దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. తీరంలో గాలులు గంటకు 45 నుంచి 55 కిమీ. వేగంగా వీచనున్నాయి. దాంతో సముద్రంలో అలలు ఎగిసి పడనున్నాయి. ఇప్పటికే కురిసిన వానల వల్ల గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాగా భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక కాళేశ్వరం వద్ద మొదటిసారి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉదృతి పెరిగిన చోట గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News