Friday, November 22, 2024

తుఫాను ముప్పు.. మళ్లీ అతిభారీ వర్షాలు!

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఇది తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని.. అలాగే,  ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అమరావతి, విజయవాడ పట్టణాలు నీట మునిగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలు ఇల్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి.దీంతో ప్రజలు తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం లేక అల్లాడిపోయారు. దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్రమంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణం చెప్పడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News