Wednesday, January 22, 2025

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరో 24 గంటలపాటు వర్షం పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కుండపోత వానలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకల బంద్ అయ్యాయి. గ్రేటర్ వరంగల్‌లో పలు కాలనీల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News