మనతెలంగాణ/హైదరాబాద్: సోమవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం బలపడి వాయుగుండంగా మారి ఒడిస్సా తీర ప్రాంతంలో భువనేశ్వర్‌కు ఉత్తర ఆగ్నేయ దిశలో 70కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బుధవారం నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారి ఛత్తీస్‌ఘడ్ పరిసరాల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ద్రోణి ఇప్పుడు సముద్రమట్టం వద్ద నలియా అహ్మదాబాద్ ఇండోర్ రాయగడ్ మీదుగా కోస్తా ఒరిస్సా వద్ద ఉన్న వాయుగుండం వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు పశ్చిమ షేర్ వద్ద మంగళవారం సుమారుగా 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదుగా ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో సముద్ర మట్టం నుంచి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ముసురు కురుస్తోంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ జాం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 48 మిల్లీమీటర్లు, సిద్ధిపేటలో 28, రాజన్న సిరిసిల్లలో 28, రంగారెడ్డిలో 9, హైదరాబాద్‌లో 08, మేడ్చల్ మల్కాజిగిరిలో 06 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains to hit North Telangana