Monday, December 23, 2024

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్!

- Advertisement -
- Advertisement -

Rain

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్‌లో అనేక కాలనీలు ముంపునకు గురయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డిలో పరిస్థితి ఘోరంగా ఉంది. రాజంపేట మండలం లింగాయపల్లిలో మండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో రాజంపేట నుంచి కామారెడ్డికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వానలు కురిసేందుకు ఆస్కారం ఉంది. పలు జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News