Monday, January 20, 2025

తెలంగాణలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కురుసున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. గత రెండు మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

ఇక, హైదరాబాద్ లోనూ భారీగా వర్షం కురుస్తోంది. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరుకోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణకు భారీ వర్షం ముప్పు పొంచిన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News