Monday, November 25, 2024

రాగల రెండురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rains with thunder and lightning for next two days

తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం

మనతెలంగాణ/హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఉత్తర కోస్తా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు సమీపంలో కేంద్రీకృతమైన వాయుగుండం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం సాయంత్రానికి పశ్చిమ బంగాల్, ఒడిశా సరిహద్దుల్లోని బాలాసోర్, సాగర్ దీవుల సమీపంలో తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్టు స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News