Thursday, January 23, 2025

జోరందుకున్న వర్షాలు.. నగరానికి ఎల్లో అలర్ట్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : నగరంలో వర్షాలు జో రు అందుకున్న నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. గత రెండు రోజులుగా నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా బుధవారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో సహాయక బృందాలను అప్రమత్తం చేశారు.

సహాయక బృందాలను మూడు షిప్టులుగా కేటాయించిన అధికారులు ప్రతి షిప్టులోని సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో ఎప్పుడు అందుబాటులో ఉండనున్నాయి. ఇ ప్పటికే ట్రాఫిక్ పోలీసుల సహాయం రోడ్లపై వరదనీరు నిలుస్తున్న ప్రదేశాలను గుర్తించిన జిహెచ్‌ఎంసి అయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను మోహరించారు. త ద్వారా రోడ్లపై చేరిన నీటిని వెంటనే నాలాల గుండా పంపించడం ద్వారా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కల్గకుండ చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది 374 ప్రత్యేక సహాయక బృందాలు ఏర్పాటు :
వర్షకాలం ముందస్తూ కార్యచరణలో భాగంగా ఇప్పటీకే జిహెచ్‌ఎంసి ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా వర్షకాలంలో చినుకులు పడితే చాలు లోతట్టు ప్రాంతాలు జలమ యం కావడంతో పాటు రోడ్లపై సైతం భారీగా వరద నీ రు చేరుతుండడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో నగర ప్రయాణికులకు కష్టాలు తప్పని పరిస్థితి. దీంతో ఈ ఏడాది వర్షాకాలం ప్రవేశానికి ముందే వర్షాల కా రణంగా ప్రజలకు సాధ్యమైనంత మేర ఇబ్బందులు క లగకుండ ఉండేందుకు జిహెచ్‌ఎంసి పక్కా ప్రణాళికల తో సమాయత్తమైంది.

ఇందులో భాగంగా రూ.44 కోట్ల వ్యయంతో గ్రేటర్‌వ్యాప్తంగా మొత్తం 374ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశారు. ఈ 374 బృందాలను సంచా ర బృందాలు, మొబైల్ ఎమర్జెన్సీ బృందాలుగా వీడదీసి సర్కిళ్ల వారిగా కేటాయించారు. వీటికి అదనంగా సర్కి ల్ ఒక్కటి చోప్పున 30డిఆర్‌ఎఫ్ బృందాలతో పాటు జలమండలి అదనంగా 16 బృందాలు ఏర్పా టు చేశారు. వర్షాలు మొదలు ఎలాంటి విపత్తులు ఏర్పడిన తక్షణ సహాయ చర్యలు అందించేందుకు అత్యవసర సహాయక అందుబాటులో ఉండనున్నాయి.

ఈ బృందాలు 24/7 క్షేత్రస్థాయిలో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ బృందాలు అక్టోబర్ చివరి వరకు 24/7 ప ని చేయనున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా వార్డు కార్యాలయాలను అందుబాటులోకి రావడంతో డివిజన్ల వారిగా క్షేత్రస్థాయిలో వ ర్షాల కారణంగా ఏలాంటి విపత్తులు సంబంధించిన తక్షణమే సహాయక చర్యలను అందించేందుకు ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా సహాయక బృందాలను కేటాయించారు. దీంతో ఈ మాన్సూన్ బృందాలన్ని స్థా నికంగా వార్డు కార్యాలయాలతో పూర్తిగా సమన్వయం చేసుకుని పని చేస్తున్నాయి. అదే విధంగా సర్కిల్‌లో డిఆర్‌ఎఫ్ బృందం ఎప్పుడు అందుబాటులో ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News