Sunday, December 22, 2024

వరుస సెలవులు.. శ్రీవారి దర్శనం కోసం వేచి చూడాల్సిందే..

- Advertisement -
- Advertisement -

తిరుమల: వేసవితోపాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు విశేషంగా భక్తులు విచ్చేశారని టిటిడి ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 48 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికరూపొందించుకోవాలని కోరారు. కాగా, తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News