Monday, December 23, 2024

జోరుగా ఇసుక రవాణ

- Advertisement -
- Advertisement -

యాలాల: యాలాల మండల పరిధిలోని కాగ్నా, కాక్రవేణి నదుల నుంచి అగ్గన్నూర్, బెన్నూరు, సంగెంకుర్దు, యాలాల, జక్కేపల్లి, విశ్వనాధ్‌పూర్, దేవనూర్, తాండూరు, మండలం అంతారం, సాయిపూర్, పాత తాండూరు తదితర గ్రామాల కు చెందిన సుమారు 50 ట్రాక్టర్లు రోజు మూడుపువ్వులు ఆరు కాయలుగా ఇసుక అక్రమ రవాణాను, ఆయా గ్రామాలకు చెందిన ఇసుకా సురులు కొనసాగిస్తూ ఒకొక్క ట్రాక్టరుకు సుమారుగా రూ. 30 వేల రూపాయలు సంపాదిస్తుంటారు. ఇందుకు కారణం లేక పోలేదు. గతంలో పై గ్రామాల ట్రాక్టర్ల యజమానులు ప్రతి రోజు రాత్రి వేళలో ఎలాంటి ప్రభత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమణ రవాణ చేస్తు వేల రూపాయలు సంపాదించేవారు.

ఈ విషయాన్ని గ్రహించిన వికారాబాద్ కలెక్టర్ వారి ఆగడాలను అరికట్టేందుకు గాను ఒకొక్క ట్రాక్టరుకు ఒక్క ట్రీప్పుకు గాను రూ. 600 వందలుగా నిర్దారిస్తూ , ప్రతిరోజు ఒక్క ట్రాక్టరు 4 ట్రీప్పుల ఇసుకను తీసుకెళేందుకు అనుమతులు మంజూరు చేయాలని యాలాల తహశీల్దార్ గోవిందమ్మను ఆదేశించ్చారు. ఇదే అదనుగా భావించిన రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ యజమానులతో కుమ్ముకై ఒక ట్రాక్టర్ నాలుగు ట్రీప్పుల ఇసుకను తరలించ్చుకొనేందుకు అనుమతులిస్తామని అందుకు గాను ్ల కలెక్టర్ ఖాతాకు ఒక్క ట్రిప్పుకు రూ. 600 వందల లెక్కన నాల్గు ట్రిప్పులకు 2వేల నాల్గు వందల రూపాయలు చెలించ్చాలని సూచించ్చారు. అంతే కాదు ట్రాక్టర్లకు అనుమంతులు ఇస్తున్నందుకు గాను ఒక ట్రాక్టరుకు రూ. 2వేలు మాకు ఇవ్వాల్సి ఉంటుందని ట్రాక్టర్ యజమానులకు తెలుపడం జరిగిందని, ఇందుకు సదరు ట్రాక్టర్ యజమానులు ఒప్పుకోవడం జరిగిందని విస్వాసనీయ సమాచారం మేరకు తెలిసింది.

ఈ లెక్కన అనుమతులు ఇచ్చిన ప్రతీ రోజు 10 నుంచి 50 ట్రాక్టర్లు ఇసుకను తరలించుటకు పూనుకొంటుండగా రెవెన్యూ కార్యాలయ అధికారులు మాత్రం రోజుకు రూ. 40 వేల నుంచి 80 వేల వరకు సంపాదిస్తునారన్న మాట. ఈ విదానాన్ని అలుసుగా తీసుకొన్న ట్రాక్టర్లల యజమానులు ఉదయం 10 గంటలకు ఇసుక రవాణాను ప్రారంభించి సాయంత్రం 5 గంటలలోపు తాము పొందిన అనుమతులకు గాను 4 ట్రిప్పులు పూర్తి చేసుకోవాలి.

కాని ట్రాక్టర్ల యజమానులు రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇస్తున్నందున ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తమ ట్రాక్టర్లతో ప్రతి రోజు 10 నుంచి 12 ట్రిప్పులు కొన సాగిస్తూ ఒకొక్క ట్రాక్టర్ ద్వారా సుమారు రూ. 35వేలు సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా యాలాల తహశీల్దార్ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండ టాన్ని గమనిస్తున్న కాగ్నా, కాక్రవేణి నదుల పరివాహక ప్రాంత రైతులు తమ పొలాలోని వ్యవసాయ బోరు బావులు పాడవటాన్ని ఎత్తి చూపుతూ తహశీల్దార్ గోవిందమ్మపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయ లోపంకారణంగా ఇసుకా సురులు రెవెన్యూ అధికారులు ఇస్తున్న అనుమతులకు విరుద్దంగా రోజుకి 4 ట్రిప్పులకు బదులుగా 10 నుంచి 12 ట్రిప్పుల ఇసుకను తరలించుక పోవడం వల్లా తమ భూములోని బోరువు బావులు పాడవుతున్నాయని కనుక ఇసుక దొంగలు రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇసుక అనుమతులకు విరుద్ధంగా నడుచుకునే అవకాశం లేకుండా చెక్ పెట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వారి అక్రమ ఆవ్యాపారానికి కళ్ళెం వేయాలని, లేని పక్షంలో రాస్తా రోకో లాంటి కార్య క్రమాలకు సైతం వెనుకాడమని వారు హెచ్చరించ్చారు.ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారించి పై వారిని శిక్షించ్చాలని పలుఉరు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News