- Advertisement -
ఐపిఎల్ మ్యాచ్ 1,500 పోలీసుల సిబ్బందితో బందోబస్తు
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌కు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 1,500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితోపాటు షీటీమ్స్, క్విక్ రియాక్షన్ టీంలతో నిఘా పెట్టారు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మ్యాచ్ సమాయనికి అనుగుణంగా మెట్రో సేవలు పొడిగించారు, రాత్రి 1గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. అలాగే ఆర్టిసి కూడా స్టేడియం వరకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరిగింది.
- Advertisement -