Monday, December 23, 2024

ఐపిఎల్ మ్యాచ్‌కు భారీ భద్రత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌కు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి డిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. ఉప్పల్‌లో ఆదివారం జరగనున్న క్రికెట్ మ్యాచ్‌కు 1,500మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియం వెలుపల,లోపల 340 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఐపిఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చే యువతులు, మహిళలు ఈవ్ టీజింగ్‌కు గురికాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

షీటీమ్స్ కూడా నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందే స్టేడియంను తెరుస్తామని, రాత్రి మ్యాచ్ లు జరిగినప్పుడు సాయంత్రం 4.30 గంటలకు స్టేడియంను తెరవనున్నట్లు తెలిపారు. క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని కోరారు. ఆన్‌లైన్‌లో క్రికెట్ మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్నామని తెలిపారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్ మధ్యలో ఎవరైనా స్టేడియం లోపలికి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భద్రత కోసం నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు. చీర్ గర్ల్‌ను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో రైలు టైం కూడా మార్చి వేశామని తెలిపారు. స్టేడియంకు వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News