Wednesday, January 22, 2025

ఒలింపిక్స్‌కు భారీ భద్రత

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెయిన్ నదిపై ఆరంభ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. ఆరంభోత్సవ కార్యక్రమానికి దాదాపు 45 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ఈ సిబ్బందిని ఆరంభ వేడుకల రక్షణకు వినియోగించనున్నారు. వీరిలో దాదాపు 18,000 మంది సైన్యానికి చెందిన వారున్నారు. మరో 35 వేల మంది జెండర్మీస్ అనే పారామిలటరీ దళానికి చెందిన భద్రతా సిబ్బంది ఉన్నారు. అంతేగాక అత్యవసరమైతే నిమిషాల్లోనే సంక్షోభ ప్రదేశానికి చేరుకునేలా 24 గంటల పాటు నాలుగు హెలికాప్టర్లను అందుబాటులో ఉచారు.

చాలా వేదికలు ఓపెన్ టాప్ విధానంలో ఉండడంతో వీటికి రక్షణ కల్పించడం సవాల్‌గా మా రింది. అయితే నిర్వాహకులు మాత్రం కళ్లు చెదిరే భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక ప్రారంభ వేడుకలు జరిగిన సెయిన్ నది ఇరువైపులా నిర్మాణాల పైకప్పులపై భద్రతా దళాలను మోహరించారు. దీంతో పాటు అతి పెద్ద సైనిక శిబిరాన్ని కూడా పారిస్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సైనికులు ఏ ఒలింపిక్ వేదికకైనా కేవలం అర్ధ గంటలోపే చేరుకునేలా చర్యలు చేపట్టారు.

దీంతో పా టు రఫెల్ ఫైటర్ జెట్స్, అవాక్స్ నిఘా విమానా లు, రీపర్ నిఘా డ్రోన్లు, షార్ప్ షూటర్లతో హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు ప్రారంభోత్సవ వేళ పారిస్ నగర పరిధిలోని 150 కిలోమీటర్ల ప్రాంతాన్ని నో ఫ్లయ్ జోన్‌గా ప్రకటించారు. కాగా, క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమానికి కొద్ది గంటల ముందు ఫ్రాన్స్‌లో హిం సాత్మక సంఘటనలు జరుగడంతో ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News