డేంజర్ జోన్‌లోకి జారుకుంటున్న అగ్రరాజ్యం?
ఆస్టిన్(అమెరికా) : కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి విపరీత హిమపాత బీభత్సంతో బందీలు అయ్యా రు. దేశానికి ఇదే ఎప్పటికీ తీరని భవితవ్యపు సవాలు అవుతుందనే భయం అమెరికాలోని కొన్ని ప్రాంతాలవారిని కుంగదీస్తోంది. టెక్సాస్, సమీప రాష్ట్రాలలో ఫిబ్రవరి దాదాపుగా అత్యధిక జనులను ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో వణికించింది. పలు కుటుంబాలు ఆకస్మికంగా తలెత్తిన విద్యుత్ ఆటంకాలతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. రోజుల తరబడి గజగజ వణికారు. వేడిమి కోసం ఇంట్లోని ఫర్నిచర్లు తగులబెట్టుకుని మంచు కాచుకున్నా రు. విపరీతమైన చలిని పారదోలేందుకు తమంతట తాము గా కొత్త మార్గాలు వెతుక్కున్నారు. కారు ఇంజిన్లను స్టార్ట్ చేసివాటిలోనే పడుకున్నారు. తాజా ఆహారం, సురక్షితమై న తాగునీటికోసం తల్లడిల్లారు. ఇది అమెరికానేనా అని నిట్టూర్చారు. టెక్సాస్‌కు ఎందుకు ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది.
ఈ ప్రాంతానికి ప్రత్యేక విద్యుత్ గ్రిడ్ ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో నిమిత్తం లేకుండా తమ విద్యుత్ అవసరాలను తాము చక్కగా తీర్చుకుంటామని ఇంతకాలం ధీమాతో ఉన్నారు. అయితే విపరీత స్థాయిలో వచ్చిపడ్డ మంచుతుపాన్లతో విద్యుత్ వినియోగం పెరిగిం ది. దీనితో గ్రిడ్‌లు పనిచేయని స్థితి ఏర్పడింది. పలు ప్రాంతా లు అంధకారంలో మునిగాయి. గ్రిడ్‌ల వైఫల్యం, సమృద్థి గా సహజ వాయువుల వనరులు లేకపోవడంతో ప్రతికూ ల వాతావరణం నుంచి తట్టుకునే వ్యవస్థ దెబ్బతింది. అర్కి టిక్ ధృవ ప్రాంతాలలో ఏర్పడ్డ దీర్ఘకాలిక అల్పపీడనం దీనితో తలెత్తిన వాతావరణ మార్పుల ప్రభావం ఉన్నట్లుండి అసాధారణ రీతిలో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అమెరికాలోని దక్షిణ ప్రాంతపు లోతట్టు దిశలో ఇటువంటి కరకు మంచు వర్షాల పరిణామం అనూహ్యమేమీ కాదు. అయితే ఈ ప్రాంతానికి ఇది చాలా అరుదు. పైగా అత్యంత తీవ్రస్థాయి చలి, దిగజారిన వాతావరణ పరిస్థితి టెక్సాస్‌కు ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. ప్రస్తుత పరిస్థితిని పలువురు నల్లబాతు పరిణామంగా తిట్టిపోశారు. సాధారణంగా ఏ ప్రాంతానికి అయినా తెల్లబాతులు వస్తే అది శుభసూచకం, అంతకు మించి ఆహ్లాదకరంగా భావిస్తారు. సరైన వాతావరణంలోనే ఇటువంటి సహజమైన శ్వేత వర్ణపు బాతులు వస్తుంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రకృతి వైపరీత్యంతో తలెత్తిన పరిస్థితిని బ్లాక్‌స్వాన్ పరిణామం అంటారు. ఇది జీవితకాలంలో ఒకే ఒక్కసారి అరుదెంచిన అరుదైన చారిత్రక ఘట్టం అని, ఇది తమను బాగా కాటేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందుగానే చెప్పినా కేర్ లేదు
జనవరి ఆరంభం నుంచే వాతావరణ హెచ్చరికలలో ఇటువంటి అర్కిటిక్ ధృవ వైపరీత్యాల గురించి తెలియచేస్తూ వచ్చారు. చాలా రోజుల క్రితమే వాషింగ్టన్ పోస్టు పత్రిక లో ఉత్తర ధృవ ప్రాంతంలో ఎత్తైన భాగాలలో ఉష్ణోగ్రతలు విపరీత స్థాయికి చేరుకుంటున్నాయని దీని ప్రభావంతో అసాధారణ స్థాయిలో వాతావరణ మార్పులు ఉంటాయ ని ఇందులో తెలిపారు. దీని ప్రభావంతో అమెరికా, ఐరోపాలపై పెను ప్రభావం పడుతుందని విశ్లేషించారు. అర్కిటిక్ శీతల గాలులు కొంపముంచుతాయని, చివరికి వీటి ప్రభావంతో జనజీవనం అస్థవ్యస్థం అవుతుందని ముందుగానే తెలిపారు. ఇటువంటి పరిణామం దశాబ్దంలో కనీ సం ఆరుసార్లు ఉంటుందని, ఇది అత్యధిక స్థాయిలో ఉంటుందని తెలిపారు. అయితే ఇది అమెరికన్ల పెరటి దాకా వచ్చే దాకా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు.
ముందే హెచ్చరికలు అయినా…
ఫిబ్రవరి ఆరంభంలోనే ఇటువంటి హెచ్చరికలు వెలువడ్డాయి. ధృవ ప్రాంతపు తుపాన్లు విరుచుకుపడుతాయని, ఇవి రాకాసి మాదిరిగా ఉంటాయని విశ్లేషించారు. ఇప్పటి పరిస్థితి తాలూకు చేదు అనుభవాలు దేశ తూర్పు ప్రాంతంలో 201314లో తరువాత రెండు మూడేళ్ల క్రితం కూడా తలెత్తాయి. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో ఇటువంటి ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వీటిని పాతచింతకాయ పచ్చడి తరహా వార్నింగ్‌లు అని గేలి చేశారు. అయితే వీటిని బేఖాతరు చేస్తూ దేశ మధ్యప్రాంతానికి ఈ మంచుతుపాన్లు వచ్చిపడ్డాయి. ఇప్పుడు అధికార మార్పిడి ఆరంభదశలో ఇటువంటి పరిణామమే జరిగింది.
అమెరికాకు తరచూ క్లైమెట్ డేంజర్లు
సరైన సమగ్ర ప్రతిస్పందన వ్యూహాలు, కార్యాచరణ లేకపోవడంతో అమెరికాకు ఎడతెగని సీరియల్ వంటి అత్యయి క వాతావరణ పరిస్థితులు దాపురిస్తూనే ఉన్నాయి. ఇవి సంక్షోభాలుగా మారి ప్రజలను దెబ్బతీస్తున్నాయి. అయి తే వీటిని అధికారిక వ్యవస్థ గుర్తించిందా? అనే అపనమ్మ కం ఇప్పుడు తలెత్తిన సంక్షోభంతో నిజమని నిర్థారితం అయింది. గత వేసవిలో పలు చోట్ల అనేక హారికేన్లు తలెత్తాయి. దీనితో అమెరికాలోని కొన్ని కీలక ప్రాంతాలు అనివార్యంగా అర్కిటిక్ ధృవాల ప్రభావంతో దెబ్బతింటాయ నే విషయం స్పష్టం అవుతూవస్తోంది. గత వేసవిలోనే పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు సంభవించాయి. 140 రోజులపాటు అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డుఅయ్యా యి. మైదాన ప్రాంతాల్లో తుపాన్ గాలులు అక్కడి మక్క పంటను అత్యధిక విస్తీర్ణంలో దెబ్బతీశాయి. పశ్చిమ మధ్య ప్రాంతంలో ఉధృతస్థాయి వరదలు అల్లకల్లోలం చేశాయి.
క్లైమెట్ క్రైసిస్‌కు వ్యాక్సిన్ ఏదీ?
కరోనాకు మరో జబ్బు కు మందు ఉంది కానీ విపరీత స్థాయికి చేరుతున్న ఈ వాతావరణ వైపరీత్యాల పరిణామానికి వ్యాక్సిన్ ఏదైనా ఉందా? ఎప్పటికైనా వస్తుందా? అనే మీమాం స ఇప్పుడు ఈ స్థితిలో చట్టుపక్కల పరిస్థితుల గురించి పెద్దగా ఆలోచించకుండా ఉండే అత్యధిక అమెరికన్లను తొలిచివేస్తోంది.
చలి వేసినప్పుడే స్వెట్టర్ వేసుకునే టైప్
గత ఏడాది22 దఫాలు తలెత్తిన వాతావరణ వైపరీత్యాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు 1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ దశలో అమెరికన్ల స్పందన ఎవరిని ఆశ్చర్యపర్చలేదు. బయటకు వెళ్లలేకపోతే ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. లేదా బ్లాంకెట్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు అనే ధోరణి ప్రబలింది. పిడుగులు పడినప్పుడు చెట్టు కిందకు దారులు వెతుక్కునే స్పందనే ఉంది. ప్రభుత్వ నుంచి సాయం, విద్యుత్ సంక్షోభాలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ వనరులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వంటివి కేవలం పరిస్థితి దిగజారినప్పుడు ఏర్పాట్లకు దిగడంతోనే సరిపోతోంది. ఎప్పటికీ వీడనంటున్న ధృవ ప్రాంతపు అసాధారణ పరిస్థితులనుంచి శాశ్వత పరిష్కారం దిశలో అగ్రరాజ్యమైన అమెరికా ట్రంప్‌లు పోయి బైడెన్‌లు వచ్చినా ఆలోచించే పరిస్థితి లేదు. గ్రహాంతర పరిధి గురించి ముసురుకుంటున్న ఆలోచనలు స్థానిక అంతర పరిస్థితుల పట్ల స్పందన దిశకు మళ్లని ముళ్ల కంచెల స్థితి ఉంది.