హైదరాబాద్: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. వృద్ధ యాత్రికుల ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. కేదార్‌నాథ్‌లో ప్రజలు తమ నివాస ప్రాంతాల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరడంతో పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్ యాత్ర ఇప్పటికే రద్దు చేయబడింది. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులను గుర్రాలపై క్రిందికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.దాదాపు 150 మంది తెలుగు వారు ఈ పరిస్థితికి గురవుతున్నట్లు సమాచారం. రిషికేశ్‌లో యాత్రికుల నమోదు తాత్కాలికంగా నిలిపివేయబడింది. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
#WATCH | Uttarakhand: Amid the ongoing Char Dham Yatra, Kedarnath reels under another spell of snowfall. pic.twitter.com/gysNc2Ru6f
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 2, 2023