Wednesday, July 3, 2024

కేదార్‌నాథ్ సమీపంలో భారీ హిమపాతం

- Advertisement -
- Advertisement -

రుద్రప్రయాగ్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు ఎగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో గల గాంధీ సరోవర్‌ను అతిపెద్ద మంచుచరియ ఢీకొన్నది. చొరాబరి గ్లేసియర్ సమీపంలో సంభవించిన హిమపాతం అదే ప్రాంతంలో లోయలో పడింది. కానీ దాని వల్ల ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ లేవు. ఆదివారం ఉదయం కేదార్‌నాథ్ ఆలయ సందర్శనకు వెళ్లిన భక్తులు తెల్లవారు జామున సుమారు 5 గంటలకు సంభవించిన ఆ ప్రకృతి వైపరీత్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఒక భారీ మంచు చరిక వేగంగా జారుతూ వచ్చి లోయలో పడిన తరువాత నిలచిపోయింది. హిమపాతం వల్ల ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ లేనట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు, కేదార్‌నాథ్ లోయతో సహా మొత్తం ప్రాంతం భద్రంగా ఉందని రాజ్వార్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News