Monday, January 20, 2025

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -
Heavy rain in Tamilnadu
ముగ్గురు మృతి

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని  చెన్నై నగరం సహా 13 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు తమిళనాడులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఎడతెరిపిలేని వానలకు ముగ్గురు మరణించారు. చెన్నైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీ వర్షాల కారణంగా 8 జిల్లాల్లో పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా, తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది.

తమిళనాడును అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు తాకాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసి) నవంబరు 2 వరకు చెన్నై నగరానికి భారీ వర్ష సూచన చేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆర్ఎంసి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News