హైదరాబాద్: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. బుధవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేయగా, దక్షిణ తెలంగాణ పూర్తిగా ఆరెంజ్ వార్నింగ్‌లో ఉంది. రేపు దాదాపుగా 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రెడ్ అలర్ట్ ప్రకటించామని అధికారులు వెల్లడించారు.
అలాగే రేపు కొన్ని ఈశాన్య, తూర్పు తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణలోని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అమలులో ఉంది. మిగితా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల్లో వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు నగర రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.