Saturday, January 11, 2025

అబ్దుల్లాపూర్ మెట్ లో భారీగా ట్రాఫిక్ జామ్…ఆ రెండు దారుల్లో వెళ్లండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలు ఒక్క సారిగా పల్లె బాట పట్టడంతో శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్‌ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు నెమ్మదిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. విజయవాడ జాతీయరహదారిపైప ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తున్నారు. విజయవాడ జాతీయ రహదారిలో పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు మరో రెండు మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

అద్దంకి నార్కట్‌పల్లి రహదారికి బదులుగా సాగర్ మీదుగా మాచర్ల రహదారి ఎంచుకోవాలని సూచించారు. ఎల్‌బి నగర్ నుంచి వెళ్లే వాహనాలు బిఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మీదుగా సాగర్‌కు దారి ఉంటుందన్నారు. ఓఆర్‌ఆర్ నుంచి వెళ్లే బొంగులూరు ఎగ్జిట్ నుంచి సాగర్‌కు ప్రత్యామ్నాయ రహదారి, విజయవాడ ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయంగా ఘట్‌కేసర్, భువనగిరి, చిట్యాల రహదారి ఎంచుకోవాలని పోలీసులు సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి ఉప్పల్, ఘట్‌కేసర్, భువనగిరి మీదుగా చిట్యాల వెళ్లాలని సూచిస్తున్నారు. ఒఆర్‌ఆర్ మీదుగా ఘట్‌కేసర్ వద్ద ఎగ్జిట్ అయి భువనగిరి మీదుగా చిట్యాల వెళ్లవచ్చన్నారు.

దీంతోపాటు రైల్వేస్టేషన్‌లు, ఎంజిబిఎస్, జేబిఎస్ బస్టాండ్‌లు సైతం ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. రైళ్లలో రిజర్వేషన్‌లు దొరక్కపోవడంతో జనరల్ బోగీల్లోనైనా వెళ్లాలన్న తాపత్రయంతో ప్రయాణికులు భారీగా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. రైళ్లో రిజర్వేషన్‌లు దొరకని ప్రయాణికులు బస్సుల్లోనూ వెళ్లడానికి భారీగా ఇమ్లీబన్‌కు తరలివస్తుండడంతో ఆ ప్రాంతమంతా ప్రయాణికుల రాకతో సందడిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News