Monday, January 20, 2025

రహదారులపై రద్దీ

- Advertisement -
- Advertisement -

సెలవులు ముగియడంతో పల్లెల
నుంచి పట్నం తిరుగు పయనమైన
ప్రజలు జాతీయ రహదారులపై
భారీగా ట్రాఫిక్‌జామ్‌లు రుసుం
వసూలు చేయకుండానే దుద్దెడ
టోల్‌ప్లాజా గేట్లు ఎత్తివేత

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ లో భారీగా వాహనాల రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు వస్తుండటంతో రద్దీగామారింది.దసరా పండుగను సొంతూర్లలో బంధుమిత్రులతో కలిసి జరుపుకు న్న పలువురు సంబురాలు ముగియడంతో తిరు గు పయనమయ్యారు. సోమవారం నుంచి ప్ర భుత్వ కార్యాలయాలు, మంగళవారం నుంచి విద్యాలయాలు ప్రారంభం కానుండటంతో హై దరాబాద్‌కు చేరుకునేందుకు బయలుదేరారు. దీంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసి పోయింది. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు.

తెలంగాణ ప్రాంతంలో దసరా, బతుకమ్మ పండుగ లు ఘనంగా నిర్వహించుకుంటారు. దసరా సెలవులు కావడంతో,  చిన్నాపెద్దా అంతా కలిసి కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలతో కరీంనగర్ -హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. భాగ్యనగరంలో నివాసం ఉన్న తెలంగాణ ప్రాంత వాసులు స్వస్థలాల నుంచి కార్లు, ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు పయనం అవ్వడంతో హుస్నాపూర్ టోల్ గేట్ వద్ద వాహనాలతో రద్దీ పెరిగింది. కరీంనగర్ నుంచి మొదటి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా వరుస కట్టాయి. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటం వల్ల, టోల్‌గేట్ దగ్గర జాప్యం జరుగుతోంది.

రుసుము తీసుకోకుండా వాహనాలకు అనుమతి

సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారి దుద్దెడ టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో అందరూ హైదరాబాద్‌కు ప్రయాణం కావడంతో టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొని రెండు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దసరా సెలవులకు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన ఉద్యోగులు, వ్యాపారస్తులు విద్యార్థులు తిరిగి భాగ్యనగరా నికి సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం కావడంతో రాజీవ్ రహదారి సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో టోల్‌గేట్ ఎత్తేసి రుసుము తీసుకోకుండా వాహనాలకు అనుమతి ఇచ్చారు. సాధారణ రోజుల కంటే ఈరోజు మరో లైన్‌ను అదనంగా పెంచినప్పటికీ వాహనాలు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News