Sunday, December 22, 2024

టిడిపి శ్రేణులు కన్నెర్ర… చిలకలూరిపేట హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

పల్నాడు: నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఎపి సిఐడి అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు. అయితే కాన్వాయ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చేరుకోగానే పార్టీ శ్రేణులు కార్లు అడ్డుపెట్టి కాన్వాయ్‌ను నిలిపివేశారు. ప్రధాన రహదారిపై టైర్లు తగలపెట్టి, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై ఖమ్మం జిల్లాలో టిడీపీ శ్రేణులు కన్నెర్ర చేశారు. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో సిఎం జగన్ దిష్టిబొమ్మను పార్టీ కార్యకర్తలు దహనం చేశారు. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు. అశ్వారావుపేట తదితర ప్రాంతాలలో నిరసన చేపట్టారు.

చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని ఎపి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ టిడిపి అభిమానులు ఆందోళనకు దిగారు. జీ20 సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే కుట్ర ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ బాబు అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆయనను చూడటానికి వెళ్తానన్న నారా లోకేష్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News