హైదరాబాద్: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగి పోయింది. రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు సాధారణం కంటే హైవేపై రెట్టింపు వాహనాలు ప్రయాణిస్తున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇక అటు సొంతూళ్ల నుంచి.. హైదరాబాద్ కు వచ్చే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 3500 బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల సెలవులను పెంచేసింది. 16 వ తేదీతో ముగియాల్సిన సంక్రాంతి సెలవులు సిఎం ప్రకటనతో జనవరి 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.
*